← Back to news

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై ఉద్యమం

By Anusha· 5h ago
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై ఉద్యమం

TG: ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల అధిక ఫీజులతో లక్షలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని రిటైర్డ్ IAS ఎం.వి.రెడ్డి అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మంచి విద్య, సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ప్రజలు, విద్యార్థి నాయకులు, సామాజిక కార్యకర్తలను సమీకరించి ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 12 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

More in TG