పెళ్లి కంటే లివ్-ఇన్ బెటర్ అనుకుంటున్నారా?

పెళ్లి, విడాకుల చట్టాల వల్లే కొన్ని జంటలు లివ్-ఇన్ రిలేషన్షిప్స్ వైపు వెళ్తున్నాయా? అంటూ మహారాష్ట్ర UCC ప్యానెల్ ప్రజలను ప్రశ్నించింది. యూనిఫామ్ సివిల్ కోడ్పై అభిప్రాయాలు తెలుసుకునేందుకు 37 ప్రశ్నలతో ప్రశ్నావళిని విడుదల చేసింది. పెళ్లి వయసు, లివ్-ఇన్ రిలేషన్షిప్స్ రిజిస్ట్రేషన్, విడాకుల చట్టాలు, ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలు కోరింది. తమ సలహాలు, అభిప్రాయాలను నవంబర్ 15లోపు పంపాలని తెలిపింది.


