← Back to news

మల్లాయిపల్లిలో మినరల్ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ

By DK· 1d ago
మల్లాయిపల్లిలో మినరల్ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ

మల్లాయిపల్లి గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలంలోని మల్లాయిపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ నాగిరెడ్డి భూమిపూజ నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవతో ప్లాంట్ ఏర్పాటవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఎస్‌ఎఫ్ నుంచి రూ.3.50 లక్షలు మంజూరు చేయగా, ఆ నిధులతో షెడ్, మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన యంత్రాలను కమ్యూనిటీ వాటర్ ఫౌండేషన్ అందజేస్తుందని తెలిపారు.

More in Local