రైతుల సహకారంతో రాజధాని భూసేకరణ

AP: రాజధాని అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న భూసేకరణపై తుళ్లూరు మండలం పెదపరిమిలో రైతులతో గ్రామసభ నిర్వహించారు. ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, భాష్యం ప్రవీణ్, కలెక్టర్ సాయికాంత్ వర్మ రైతుల అభిప్రాయాలు, సందేహాలు తెలుసుకున్నారు. రైతుల ప్రయోజనాలు పరిరక్షిస్తూ భూసేకరణ చేపడతామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి సహకరించేందుకు పలువురు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములకు సంబంధించిన పత్రాలను ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌కు అందించారు.




