← Back to news

భయపడకు.. నీకు అండగా ఉంటా

By Lokesh· 3h ago

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నరసింహులగూడెంకు చెందిన 13 ఏళ్ల వినయ్ బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను కలిసి ఫొటో దిగాలన్నది అతడి కోరిక. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA కందాల ఉపేందర్ రెడ్డి.. KTRతో వినయ్‌ కలిసేలా చేశారు. బాలుడితో ఆప్యాయంగా మాట్లాడిన KTR ధైర్యం చెప్పారు. అతడికి మెరుగైన వైద్య సాయం అందించే విషయంలోనూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

More in TG