కాక్టెయిల్ ఇయర్ రింగ్స్ ట్రెండ్

ఇప్పుడు ఫ్యాషన్‌లో కనిపిస్తున్న మార్పుల్లో కాక్టెయిల్ ఇయర్ రింగ్స్ కూడా ఒకటి. పార్టీలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మాత్రమే కాకుండా రోజు వీటిని పెట్టుకుంటున్నారు. పెద్ద రాళ్లు, రంగురంగుల రాళ్లు, వేలాడే డిజైన్లు, సింపుల్‌గా కనిపించే మిక్స్‌డ్ మెటల్ రింగ్స్‌కి మంచి ఆదరణ ఉంది. బట్టలు సింపుల్‌గా ఉన్నప్పుడు చెవులకు పెద్ద రింగ్స్ పెట్టుకుంటే లుక్ మరింత బాగుంటుందని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు.
