అమెజాన్ లో మళ్లీ లే ఆఫ్ ల గోల !

ఈ -కామర్స్ దిగ్గజం అమెజాన్ లో మళ్లీ ఎంప్లాయీస్ తొలగింపుకు ప్లాన్ రెడీ అయ్యింది. వచ్చే నెలలో ఏకంగా 14 వేల మందిని ఇంటికి సాగనంపే అవకాశాలున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్ తో పాటు, మానవ వనరుల డిపార్టు మెంట్లో ఉద్యోగులను తొలగించే ఛాన్స్ ఉందని ఆసియా బిజినెస్ అవుట్ లుక్ తెలిపింది. గత ఏడాది 14 వేల మందిని తొలగించిన అమెజాన్, ఈ ఏడాది జనవరిలో 16 వేలమందిని తొలగించింది. ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, యాక్సెంచర్ లాంటి సంస్థలు కూడా ఉద్యోగులను ఇప్పటికే భారీగా తొలగించాయి.



