← Back to news

అన్నదాన కార్యక్రమానికి విరాళం

By Mohan· 1d ago· Vizianagaram
అన్నదాన కార్యక్రమానికి విరాళం

విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలోని సారది గ్రామంలో జరుగుతున్న శ్రీ దుర్గమ్మ తల్లి ఉత్సవాలకు జనసేన పార్టీ రాజాం నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ సమన్వయకర్త నేతుల శ్రావంతి ఆర్థిక సహాయం అందించారు. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు గ్రామానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్టోబర్ 21న నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి ₹.5,000 విరాళంగా అందజేశారు. ఈ సహాయానికి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

More in Local