← Back to news

స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించండి: లోకేశ్

By KUCHIPUDI BUJJIBABU· 8h ago· Bhadravathi Nagar, Mangalagiri, Guntur
స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించండి: లోకేశ్

గుజరాత్‌ అహ్మదాబాద్‌లో ఐసీసీ చైర్మన్ జైషాతో ఏపీ మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను జాతీయస్థాయి స్పోర్ట్స్‌ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ICC, BCCI సహకారం అందించాలని ఆయన కోరారు. ముఖ్యంగా విశాఖపట్నాన్ని సెయిలింగ్‌, రోయింగ్‌, విండ్‌సర్ఫింగ్‌, ఓపెన్‌ వాటర్‌ స్విమ్మింగ్‌, బీచ్‌ వాలీబాల్‌ వంటి వాటర్ స్పోర్ట్స్‌కు గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు. దేశీయ టోర్నమెంట్లు, మహిళల క్రికెట్‌ శిబిరాలకు ఏపీని వేదికగా మార్చాలని కోరారు.

More in AP