← Back to news

రావణ్‌కి విదేశాల నుంచి మనీ

By Sharmila· 2h ago
రావణ్‌కి విదేశాల నుంచి మనీ

AP: యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ‘ప్రశ్న రావణ్’ బ్యాంకు అకౌంట్స్‌లో ఫారిన్ నుంచి డబ్బులు వచ్చాయని పోలీసులు గుర్తించారు. ఆయన అకౌంట్స్‌లో చాలా ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు దర్యాప్తులో తేలింది. అవి సరైనవా, కాదా అనేది తెలియాల్సి ఉంది. ఫండ్స్ సోర్సులు, పొలిటికల్ రిలేషన్స్, ఆర్థికంగా సహకరిస్తున్న వ్యక్తుల వివరాలపై పోలీసులు విచారణ చేయనున్నారు. వారం రోజుల పోలీస్‌ కస్టడీ ముగియడంతో రావణ్‌ను కోర్టులో హాజరుపరిచి, తిరిగి నెల్లూరు జైలుకు తీసుకెళ్లారు.

More in AP