గవర్నమెంట్ స్కూళ్లను పట్టించుకోవడం లేదు: ఎన్.వి.రెడ్డి
TG: TPF(Telangana People Front) బస్సు యాత్ర వికారాబాద్ జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ నిర్వహించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఆకునూరి మురళి, ఎన్.వి.రెడ్డితోపాటు విద్యావేత్తలు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఎన్.వి.రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ బడులు అన్ని వసతులతో ఉండేవని, అందరూ వాటిల్లోనూ చదువుకునేవారని అన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని, ప్రభుత్వాలు గవర్నమెంట్ స్కూళ్లని పట్టించుకోవడం లేదని వివరించారు.



