వైద్యం పేరుతో వేధింపులు.. డాక్టర్కి రిమాండ్

భద్రాద్రికొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఫిర్యాదు మేరకు వైద్యుడు నాడికూడి శైలేష్ కుమార్ (39)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యం పేరుతో వేధింపులకు గురిచేశాడని మహిళ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని శ్రీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడిపై BNS, SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. నిందితుడిని అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.



