పెళ్లి కోసం కాదు.. నా కోసం డైమండ్!

ఇప్పటివరకు డైమండ్ అంటే పెళ్లి లేదా ప్రత్యేక సందర్భాలే గుర్తొచ్చేవి. కానీ Gen Zలో ఈ ఆలోచన మారుతోంది. పెళ్లి కోసం కాకుండా డైమండ్ కొనే ప్రతీ 10 మందిలో దాదాపు ఏడుగురు తమ కోసమే కొంటున్నారు. ప్రమోషన్ రావడం, ఏదైనా సాధించడం, తమను తాము సంతోషపెట్టుకోవడం కోసం కొంటున్నారు. మొత్తం కొనుగోళ్లలో పెళ్లికి సంబంధించినవి 29% మాత్రమే కాగా.. ప్రేమ, ఆనందం, తమ కోసం తాము కొనుక్కోవడం వంటి కారణాలతో 52% కొనుగోళ్లు జరుగుతున్నాయి.



