స్కూళ్ల దగ్గర జంక్ ఫుడ్ : పట్టించుకోని ఆఫీసర్లు!

TG : కరీంనగర్ జిల్లాలో స్కూళ్ల దగ్గర జంక్ ఫుడ్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చిప్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్ తినడం వల్ల పిల్లల హెల్త్ పాడవుతుందని డాక్టర్లు చెప్తున్నా ఎవరూ వినడం లేదు. పేరెంట్స్ కొనివ్వడం, పిల్లలు పాకెట్ మనీతో బ్రేక్ టైంలో కొనుక్కుని తినడం చేస్తున్నారు. స్కూల్ గేట్ కి 50 మీటర్ల లోపల వీటి అమ్మకాలను FSSAI 2020లోనే బ్యాన్ చేసింది. అయినా షాపుల వాళ్లు అమ్ముతున్నారు, అధికారులు మాత్రం అటువైపు చూడడమే లేదు.



