← Back to news

చార్‌ధామ్‌ యాత్రకు బ్రేక్

By Sharmila· 4h ago· Hindustantimes
చార్‌ధామ్‌ యాత్రకు బ్రేక్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో బద్రీనాథ్ నేషనల్ హైవేపై ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ్ జిల్లాలోని శిరోబాగఢ్ దగ్గర రాళ్లు, మట్టి.. రోడ్డుపై పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. 10 వేల మందికి పైగా యాత్రికులు అక్కడ చిక్కుకున్నారు. వీరిలో 40 మంది తెలుగు యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా చార్‌ధామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

More in National