వరదల్లో చిక్కిన 12 మందిని కాపాడిన IAF
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా జగదల్‌పూర్ దెగ్గరలో 12 మంది వరదల్లో చిక్కుకున్నారు. డోంగాఘాటి గ్రామం దెగ్గర ఇంద్రావతి నది ఉత్తర ఒడ్డున ఓ గుడిసె పైకప్పుపై మహిళలు, చిన్నారులు రాత్రంతా ఉన్నారు. గుడిసె కూలిపోయే ప్రమాదం ఉండటంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్‌ను గాల్లో నిలిపి గరుడ్ కమాండోలను పైకప్పుపైకి దించారు. తర్వాత ఒక్కొక్కరినీ హెలికాప్టర్‌లోకి ఎక్కించి మొత్తం 12 మందిని సురక్షితంగా కాపాడారు.
