డెమి ఫైన్ జువెలరీ ట్రెండ్

బంగారం, వెండి ధరలు పెరిగిన సందర్భంలో డెమీ ఫైన్ జువెలరీ కొత్త ఫ్యాషన్ ట్రెండ్‌గా మారుతోంది. తక్కువ ఖర్చుతో ఆకర్షణీయమైన డిజైన్లలో నగలు లభిస్తుండటంతో యువత వీటిపై ఆసక్తి చూపుతోంది. గోల్డ్ ప్లేటెడ్, వన్ గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ నగలతో పాటు ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాలు ఉన్న నగలకూ ఆదరణ లభిస్తోంది. రోజువారీ వాడకంతో పాటు ప్రత్యేక సందర్భాల్లో ధరించేందుకు, బహుమతులుగా ఇచ్చేందుకు వీటిని ఎంచుకుంటున్నారు.
