← Back to news

మరుగుదొడ్ల లెక్కల్లో తేడా!

By A.Ajay· 7 Oct 2026
మరుగుదొడ్ల లెక్కల్లో తేడా!

TG: గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగంపై లెక్కలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు తేడాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునేందుకు కేంద్రం సర్వే చేపట్టనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1,708 గ్రామ పంచాయతీల్లో బృందాలు పర్యటించనున్నాయి. ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్డి ఉందా, వినియోగిస్తున్నారా, బహిరంగ మల విసర్జన జరుగుతోందా అనే వివరాలను సేకరిస్తాయి. పారిశుధ్య పరిస్థితినీ పరిశీలించి నివేదికను కేంద్రానికి పంపనున్నాయి. సర్వేతో వాస్తవ పరిస్థితి మరింత స్పష్టంగా తెలియనుంది.

More in TG