పార్టీలకతీతంగా మానవత్వం.. మంత్రి అడ్లూరి స్పందన!

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల BRS అధ్యక్షుడు సింహాచలం జగన్ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీలతో సంబంధం లేకుండా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని మంత్రి తెలిపారు. మృతుని కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.50 వేలు అందజేశారు. జగన్ కుటుంబానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వడం గొప్పవిషయమని స్థానికులంటున్నారు.
