← Back to news

బ్యాడ్మింటన్ నుంచి IPSకు

By Lokesh· 1d ago· Indiatimes
బ్యాడ్మింటన్ నుంచి IPSకు

మాజీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కుహూ గార్గ్ హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ‘స్వోర్డ్ ఆఫ్ ఆనర్’ అవార్డును గెలుచుకున్నారు. IPS శిక్షణలో తొలి దశలో అత్యుత్తమ అవుట్‌డోర్ ట్రైనీగా నిలిచినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. 2013 నుంచి 2020 వరకు భారత్ తరఫున బ్యాడ్మింటన్ ఆడిన కుహూ, గాయాలు, కరోనా సమయంలో ఆటకు దూరమయ్యారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేసి, 2023 UPSC పరీక్షలో 178వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆమె గుజరాత్ క్యాడర్‌కు ఎంపికయ్యారు.

More in National