నవరాత్రుల టైంలో నాన్‌వెజ్ పిజ్జానా?.. హిందూత్వ సంస్థ ఆగ్రహం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ నగరంలో డొమినోస్ అవుట్లెట్ నుంచి ధీరజ్ కుమార్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో వెజ్ పిజ్జా ఆర్డర్ చేశారు. రెస్టారెంట్ సిబ్బంది అతనికి నాన్‌వెజ్ పిజ్జా డెలివరీ చేశారు. నవరాత్రి టైంలో ఇలాంటి ఘటన జరగడంతో ధీరజ్ కుమార్ ఆగ్రహించారు. విషయం తెలిసిన బజరంగ్ దళ్ నేత ధర్మేంద్ర సింగ్, మరికొంతమంది కార్యకర్తలు డొమినోస్ అవుట్లెట్ వద్ద ఆందోళన చేపట్టారు. పండుగ వేళ నాన్‌వెజ్ విక్రయాలు జరపడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.



