రైస్ మిల్లుల్లో అధికారుల తనిఖీలు

జోగులాంబగద్వాల జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో FCI అధికారులు తనిఖీలు నిర్వహించారు. ధాన్యం నిల్వలు, ప్రభుత్వం నుంచి సేకరించిన వడ్లు, తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం వివరాలపై పరిశీలన చేపట్టారు. మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం, బియ్యం పరిమాణంతో పాటు సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఏయే అంశాలు వెలుగులోకి వచ్చాయి, నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.





