డిస్టెన్స్ డిగ్రీలపై తెలంగాణ హైకోర్టు షాకింగ్ జడ్జిమెంట్ !

పక్క రాష్ట్రాల వర్సిటీల స్టడీ సెంటర్లలో Distance Education ద్వారా డిగ్రీలు చేసిన వారికి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రాలు దాటి నిర్వహించే ఇలాంటి డిగ్రీలు కేవలం కాగితపు ముక్కలే అని, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవి Not Valid అని తేల్చి చెప్పింది. ఈ సంచలన తీర్పుతో సర్కారీ కొలువులే లక్ష్యంగా ఉన్న వేలాది మంది అభ్యర్థుల ఫ్యూచర్ ఇప్పుడు రిస్క్‌లో పడింది!2022 లైబ్రేరియన్ పోస్టుల వెరిఫికేషన్ సమయంలో ఆచార్య నాగార్జున వర్సిటీ డిగ్రీలను టీజీపీఎస్సీ తిరస్కరించడంతో ఈ వివాదం మొదలైంది. యూజీసీ నిబంధనల ప్రకారం వర్సిటీలు తమ రాష్ట్ర సరిహద్దులు దాటి డిగ్రీలు ఇవ్వడం చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది.



