← Back to news

గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి

By rajinikanth nagilla· 1h ago· Bheemadevarpalle, Bheemadevarpalli, Hanumakonda
గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి

TG: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని ఎస్సై రాజు సూచించారు. మండపాల ఏర్పాటులో విద్యుత్ అధికారుల సూచనలు పాటించాలని, మండపం ఆవరణలో భద్రతా కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పర్యావరణానికి హాని కలగకుండా, మద్యపాన రహితంగా వేడుకలు నిర్వహించాలని సూచించారు. మండపాల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని ఎస్సై రాజు తెలిపారు.

More in Local