← Back to news

ఆ రాగి తీగల దొంగలు దొరికారు!

By Vinith· 1h ago· Bellampalle, Bellampally, Mancherial
ఆ రాగి తీగల దొంగలు దొరికారు!

మంచిర్యాల జిల్లాలో BSNL రాగి తీగల చోరీ ముఠా పట్టుబడింది. బెల్లంపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోరీలు జరిగాయి. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలతో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేశాయి. మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ పర్యవేక్షణలో సాంకేతిక ఆధారాలతో ముఠాను గుర్తించారు. మొత్తం 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. వారి గత నేర చరిత్ర, ఇతర ప్రాంతాల చోరీలపై విచారణ కొనసాగుతోంది.

More in Local