← Back to news

తెలంగాణలో ఈరోజు, రేపు భారీ వర్షాలు!

By A.Ajay· 1d ago
తెలంగాణలో ఈరోజు, రేపు భారీ వర్షాలు!

TG: తెలంగాణలో ఈరోజు, రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు కొమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ఉంది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 26 వరకు వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

More in TG