హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మృతి!

హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని హుస్సేనీ ఆలం ఏరియాలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అలీముద్దీన్ రాత్రి మృతి చెందారు. గన్ శబ్దం విని ఫ్యామిలీ మెంబర్స్, స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా, ఆయన కిందపడి కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆయన బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలీముద్దీన్ ఆటో గ్యారేజ్ నడిపేవారని, కొంతకాలంగా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారని సమాచారం.
