బాల్య వివాహాలకు నో చెప్పాల్సిందే..!

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం బింగిడొడ్డి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. నిష్కా పాత్రుడు మాట్లాడుతూ, బాల్య వివాహాలను అరికట్టాలని, అందరూ బాధ్యతగా ఉండాలన్నారు. ఉచిత న్యాయ సహాయానికి 15100, కాల్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సునంద, DCPO నరసింహ, CWC కౌన్సిలర్ జయన్న, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.





