భార్య కాపురానికి రాలేదని టవర్ ఎక్కిన భర్త!
TG: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలనుపల్లి శివారులో ఓ వ్యక్తి 33KV కరెంట్ టవర్ ఎక్కి టవర్ ఎక్కి కలకలం రేపాడు. పాలకుర్తి మండలం నరసింగపురం తండాకు చెందిన భూక్య రవి, కొన్నేళ్ళ క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ పాప, ఓ బాబు ఉన్నారు. కొంతకాలంగా గొడవలతో భార్య పుట్టింట్లో ఉండటంతో బాధపడిన రవి టవర్ ఎక్కాడు. దీంతో SI ముత్యం రాజేందర్ రెండు గంటలు ఫోన్‌లో మాట్లాడి రవిని సేఫ్‌గా కిందకు దించారు.


