72 అడుగుల మహా బతుకమ్మ.. ఎక్కడో తెలుసా?

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను హైదరాబాద్లో రేపు అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 20 టన్నుల వివిధ రకాల పూలతో 72 అడుగుల మహా బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నారు. ఈ బతుకమ్మను Asian Book of Recordsలో స్థానం సాధించే లక్ష్యంతో రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శుక్లా ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.
