గణేష్ ఉత్సవాల్లో పర్యావరణ హితం

TG: నిర్మల్ జిల్లా ముధోల్ మండలం అష్టా గ్రామంలో వినాయక చవితి ఉత్సవం పర్యావరణ హితంగా మారింది. ఉత్సవాల అన్నదానాల్లో ప్లాస్టిక్‌కి బదులు స్టీల్ ప్లేట్లు, గ్లాసులే వాడాలని గ్రామపంచాయతీ నిర్ణయించింది. SRR డయాగ్నోస్టిక్ ఓనర్ డాక్టర్ అజయ్‌రెడ్డి 800 స్టీల్ ప్లేట్లు, 150 గ్లాసులు డొనేట్ చేశారు. ప్లాస్టిక్ రహితంగా మార్చడమే తమ లక్ష్యమని సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ చెప్పారు.
