హాలహర్విలో పోలింగ్ కేంద్రాలివే..

కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో MPTC పోలింగ్ సెంటర్ల లిస్ట్ రిలీజ్ అయింది. MPDO వరలక్ష్మి మంగళవారం ఈ వివరాలు తెలిపారు. మండలంలో 12 MPTC సీట్లు ఉన్నాయి. మొత్తం 36,811 మంది ఓటర్లు ఉన్నారు. వారికోసం 42 పోలింగ్ సెంటర్లను గుర్తించారు. జాబితా విడుదల చేశారు. మంగళ, బుధవారం రెండు రోజులు అభ్యంతరాలు స్వీకరిస్తారు. బుధవారం అన్ని పార్టీల నేతలతో మీటింగ్ పెట్టారు. ఈ ప్రోగ్రామ్‌లో డిప్యూటీ MPDO రామాంజనేయులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.



