← Back to news

శభాష్ గాయత్రి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంస

By Vishi· 2h ago· X

AP: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానంలోని నిత్యాన్నదాన కేంద్రంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడికి అన్నప్రసాదం తినిపించి ఆకలి తీర్చారు మహిళా సిబ్బంది గాయత్రి. ఆమె సేవను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. “శభాష్ గాయత్రీ! ద్వారకా తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు. ‘మానవ సేవే మాధవ సేవ’ అని చాటి చెప్పిన మీ స్ఫూర్తి అభినందనీయం” అని ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

More in AP