← Back to news

ప్రగతినగర్‌లో ఘన గణపయ్య పూజలు..!

By srikanth· 19h ago· Narsampet (Ct), Narsampet, Warangal
ప్రగతినగర్‌లో ఘన గణపయ్య పూజలు..!

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం ప్రగతినగర్ కాలనీలో సోమవారం గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేద పండితులు విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గిరాబోయిన సురేష్ మాట్లాడుతూ.. 45 ఏళ్లుగా బాల గణపతి నుంచి బొజ్జ గణపయ్య వరకు పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విగ్రహ ప్రతిష్టాపన రోజు వర్షం జల్లుల ఆశీర్వాదం ప్రత్యేకత అని అన్నారు. స్వామి అనుగ్రహం కాలనీవాసులతో పాటు అందరికీ ఉండాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మీ ఊళ్లో మట్టిగణేషుడిని పెడితే ఫొటో, వార్త పంపండి.

More in Local