సిద్ధేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే నాయిని పూజలు

వినాయక చవితిని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సిద్ధేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ జిల్లా పరిధిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన సిద్ధేశ్వర ఆలయంలో పరమశివుడికి అభిషేకం చేసి పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
