స్మార్ట్ మీటర్లు బలవంతంగా బిగించొద్దు
AP: తిరుపతి జిల్లాలో స్మార్ట్ మీటర్ల బిగింపు విషయంలో ప్రజల ఇష్టాయిష్టాలను గౌరవించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లను బలవంతంగా బిగించవద్దని విద్యుత్ శాఖ మంత్రి స్పష్టం చేసినప్పటికీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ప్రజల అంగీకారం లేకుండా మీటర్లు బిగించేందుకు ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. మంత్రి ఒక మాట, సీఎండీ మరో మాట చెప్పడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.



