బాలాపూర్ గణేష్ లడ్డూకి రికార్డు ధర

TG: హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది. సామ ప్రణీత్ రెడ్డి 39 లక్షల రూపాయాలకు లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది 35 లక్షల రూపాయాలకు లడ్డూ అమ్ముడవగా.. ఈసారి 4 లక్షలు రూపాయాలు అధికంగా ధర పలికింది. దీంతో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం మరోసారి వార్తల్లో నిలిచింది.



