S.I.Rపై సుప్రీంకోర్టుకు ఒవైసీ!

S.I.R ప్రక్రియను సవాలు చేస్తూ AIMIM చీఫ్, MP అసదుద్దీన్ ఒవైసీ.. బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పెద్ద ఎత్తున ఓటర్ల పేర్ల తొలగింపు, ఫారమ్-6 సవరణలు వంటి అంశాల్ని ఇందులో ప్రస్తావించారు. ఈ పిటిషన్ CJI సూర్యకాంత్, జడ్జి జోయ్మాల్యా బెంచ్ ముందు విచారణకు వచ్చింది. లాయర్ నిజాముద్దీన్ పాషా.. పిటిషన్పై మాట్లాడుతూ.. "గురువారం విచారణకు వచ్చే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర ప్రతిపక్ష నేతల పిటిషన్లతో కలిపి.. ఈ పిటిషన్ని కూడా విచారించాలని కోరారు. పరిశీలించి లిస్ట్ చేస్తామని CJI చెప్పారు.


