← Back to news

సంప్రదాయ విత్తన సంరక్షకుడు చెరువాయల్ రామన్ కన్నుమూత

By Vishi· 2h ago· Thehindu
సంప్రదాయ విత్తన సంరక్షకుడు చెరువాయల్ రామన్ కన్నుమూత

కేరళంలోని వయనాడ్‌కు చెందిన ప్రముఖ సంప్రదాయ వరివిత్తన సంరక్షకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత చెరువాయల్ రామన్(74) ఇవాళ కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కోళికోడ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. దాదాపు 50కి పైగా అరుదైన సంప్రదాయ వరి రకాలను ఆయన కాపాడారు. దేశీయ విత్తనాల సంరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ఆయనను స్థానికంగా ప్రజలు 'నెల్లాచన్' (వరి విత్తనాల తండ్రి) అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.

More in National