← Back to news

ధాన్యం లెక్కల్లో తేడా.. పలువురిపై కేసులు

By NRPT· 1d ago· Nagarkurnool
ధాన్యం లెక్కల్లో తేడా.. పలువురిపై కేసులు

నాగర్ కర్నూల్‌లోని మహాలక్ష్మి పార్బాయిల్డ్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ₹.9.68 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పౌరసరఫరాలశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి 3,774.818 మెట్రిక్ టన్నుల ధాన్యం, 94,370 బస్తాలకు సంబంధించి కొరతను గుర్తించారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ దండు రాజేందర్ ఫిర్యాదు మేరకు ఆకుతోట సాయిబాబు, సుదర్శన్‌తోపాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More in Local