‘ఓట్ చోర్’పై అంతర్జాతీయ గళం: ధ్రువ్ రాఠీ

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఇండియా నుంచి లండన్ చేరుకున్నట్లు తన 'X'లో పోస్ట్ చేశారు. ‘ఓటు దొంగలు, ప్రజాస్వామ్య హంతకుల’ యొక్క వాస్తవాలను ప్రపంచానికి చూపించాల్సిన సమయం వచ్చిందని కామెంట్స్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ అంశంపై గళం వినిపించాలంటూ, లండన్లోని Parliament Square దగ్గర మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరిగే నిరసనలో పాల్గొనాలని అక్కడున్న వారికి పిలుపునిచ్చారు. చివరగా ‘జై హింద్’ అంటూ తన దేశ భక్తిని చాటుకున్నారు.


