← Back to news

బుద్ధ విహార్‌లో విపస్సి ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం

By Mulnivasi Malaji· 1d ago· Nizamabad, Vangoor, Nagarkurnool
బుద్ధ విహార్‌లో విపస్సి ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం

TG: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లోని మోక్షానంద బుద్ధ విహార్‌లో ఆదివారం ఐతిహాసిక విపస్సి ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘపాల బంతే చేతుల మీదుగా దమ్మ ధ్వజారోహణ, బుద్ధపాల బంతే చేతుల మీదుగా బుద్ధ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన చెన్నూరు ఆంజనేయ రెడ్డి, కె.కె. రాజా అతిథి ఉపన్యాసాలు చేశారు. విగ్రహదాత డా. పాకాల మమత, ఎంబీవీ చీఫ్, త్రిపిటక అనువాదకులు, బౌద్ధ మేధావి బంతే ధమ్మ రఖ్ఖిత విపస్సి ధ్యానం అవసరాన్ని వివరించారు.

బుద్ధ విహార్‌లో విపస్సి ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం

More in Local