← Back to news

అరకులోయలో ఎన్నికల కోడ్ అమలు

By B V Appalanaidu· 1d ago· Alluri Sitharama Raju
అరకులోయలో ఎన్నికల కోడ్ అమలు

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లను తొలగించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

More in Local