← Back to news

సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయాన్ని స్వాగతించిన ప్రకాశ్ రాజ్

By Vishi· 4h ago
సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయాన్ని స్వాగతించిన ప్రకాశ్ రాజ్

SIRకు వ్యతిరేకంగా అక్టోబర్ 23న తలపెట్టిన దేశవ్యాప్త ఆందోళనల్లో సంయుక్త కిసాన్ మోర్చా(SKM) భాగస్వామ్యం కావడంపై నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని రైతులు, దళిత సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ ఒక్కతాటిపైకి రావడం మంచి విషయం అన్నారు. ఈ పరిణామం ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను చూపిస్తోందని వివరించారు. ఇది రాజకీయ సమస్య కాదని, పౌరుడి ఓటు హక్కుకు, ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటమని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

More in National