← Back to news

SC షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు

By DK· 25 Jun 2026· నాగర్ కర్నూల్ జిల్లా
SC షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలోని SC షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని గురువారం దళిత నిరుద్యోగ యువత రిలే నిరాహార దీక్షకు దిగారు. పారదర్శకత లేకపోవడం, అనర్హులకు రాజకీయ సిఫార్సులతో కేటాయింపులు చేయడం వంటి కారణాల వల్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బస్టాండ్ ఎదురుగా ఉన్న SC కాంప్లెక్స్‌లోని 34 దుకాణాలను అర్హులైన పేద దళితులకు ఇవ్వడంలో మొండిచేయి చూపారని, నిరుపేద దళిత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా పక్కదారి పట్టిందని వారు ఫైరయ్యారు.

More in Local