భారీ వర్షాలపై కలెక్టర్లకు మంత్రి కీలక సూచనలు!

TG: తెలంగాణలో భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని చెప్పారు. అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌లు, టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు.



