కేయూ హాస్టళ్లలో నాన్ బోర్డర్ల హల్‌చల్!

కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో నాన్-బోర్డర్ల సమస్యపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అనుమతి లేకుండా హాస్టల్ గదుల్లో ఉంటూ, మెస్‌లోనూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని సమాచారం. దీంతో హాస్టళ్లలో నీరు, ఇతర సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోందని విద్యార్థులు చెబుతున్నారు. నాన్-బోర్డర్ల కారణంగా గొడవలు కూడా జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.



