← Back to news

12 ఏళ్లుగా మట్టి వినాయకుల పంపిణీ..!

By Jagadish· 17h ago
12 ఏళ్లుగా మట్టి వినాయకుల పంపిణీ..!

గుంటూరు జిల్లా పట్టిసీరుకూరు మండలం లేమల్లెపాడు గ్రామంలో వినాయక చవితి స్పెషల్. బొమ్మినేని ప్రేమ సాగర్ రావు సోమవారం ఉదయం మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. విగ్రహాలతో పాటు పూజకు అవసరమైన సామగ్రిని కూడా అందించారు. గడిచిన 12 ఏళ్లుగా గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్లాస్టిక్ వద్దు.. మట్టి గణపతినే పూజిద్దాం అని పిలుపునిచ్చారు. మీరు మట్టిగణపతిని ప్రతిష్టించారా? అయితే మీ గణేషుడి ఫొటో, వార్త పంపండి.

More in Local