← Back to news

కార్మికుల పోరాటానికి విరాళాల సేకరణ

By Surender Panuganti· 1d ago· Mahabubnagar
కార్మికుల పోరాటానికి విరాళాల సేకరణ

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మున్సిపల్ శానిటేషన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 26న నిర్వహించనున్న చలో హైదరాబాద్ ధర్నాను విజయవంతం చేసేందుకు విరాళాలు సేకరించారు. వంటావార్పు కార్యక్రమం నిర్వహణ కోసం జడ్చర్ల మున్సిపల్ కార్మికుల హాజరు పాయింట్ల వద్ద ఈ సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్, పట్టణ కమిటీ అధ్యక్షురాలు ఇందిరమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, ఉపాధ్యక్షుడు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

More in Local