కాన్పూర్‌లో రోడ్డుపై 18 అడుగుల గొయ్యి
UPలోని కాన్పూర్ నగరంలోని జాజ్‌మౌ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. రోడ్డు అకస్మాత్తుగా కుంగి 18 అడుగుల లోతైన, 10 అడుగులు వెడల్పు ఉన్న పెద్ద గొయ్యి ఏర్పడింది. వర్షపు నీరు ఆ గొయ్యిలోకి వేగంగా ప్రవహిస్తూ నిజమైన వాటర్‌ఫాల్‌లా కనిపించింది. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. పోలీసులు బ్యారికేడింగ్ చేసి ఈ రోడ్డును మూసేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేస్తూ ‘జపనీస్ టెక్నాలజీతో నిర్మించిన వాటర్‌ఫాల్’ అని బీజేపీ ప్రభుత్వంపై సెటైర్ వేసింది. ఇలాంటి ఘటనలతో నిర్మాణ లోపాలపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.



